దేశవ్యాప్తంగా ప్రశాంతంగా ముగిసిన నీట్ యూజీ పరీక్ష

  • మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగిన పరీక్ష
  • హాజరైన 20 లక్షలకు పైగా విద్యార్థులు
  • 25 పట్టణాల్లో 180 కేంద్రాల్లో పరీక్ష నిర్వహణ
  • పరీక్ష కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన నిబంధనలు అమలు
దేశవ్యాప్తంగా వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ యూజీ 2026 పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఆధ్వర్యంలో ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమైన ఈ పరీక్ష, సాయంత్రం 5 గంటలకు ముగిసింది.

ఈ ఏడాది దేశవ్యాప్తంగా 552 నగరాలు, 14 అంతర్జాతీయ కేంద్రాల్లో కలిపి సుమారు 20 లక్షల మందికి పైగా విద్యార్థులు నీట్ పరీక్షకు హాజరయ్యారు. పరీక్ష నిర్వహణ కోసం ఎన్‌టీఏ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. విద్యార్థులను ఉదయం 11 గంటల నుంచే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించారు. మధ్యాహ్నం 1:30 గంటలకు గేట్లు మూసివేసి, ఆ తర్వాత వచ్చిన వారిని లోపలికి అనుమతించలేదు.

పరీక్ష కేంద్రాల వద్ద డ్రెస్ కోడ్‌తో పాటు, ఇతర నిబంధనలను కఠినంగా అమలు చేశారు. అడ్మిట్ కార్డు, ఫొటో, ప్రభుత్వ గుర్తింపు కార్డు ఉన్నవారిని క్షుణ్ణంగా తనిఖీ చేసి లోపలికి పంపించారు. విద్యార్థులకు 1:45 గంటలకు ప్రశ్నపత్రాలు, ఓఎంఆర్ షీట్లు అందజేసి, 2 గంటలకు పరీక్ష ప్రారంభించారు. పరీక్ష ముగియడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.

NEET UG
NEET UG 2024
National Testing Agency
NTA
Medical Entrance Exam
NEET Exam
NEET UG Exam
India NEET Exam

More Telugu News